: మన నుంచి మహిళలను ఎవరు కాపాడతారు? పురుషుడిగా పుట్టినందుకు సిగ్గుగా ఉంది: నటుడు సిద్ధార్థ్
దేశంలో జరుగుతున్న లైంగిక వేధింపులపై నటుడు సిద్ధార్థ్ ఆవేదన వ్యక్తం చేశాడు. ఈ అంశంపై తన ట్విట్టర్ ఖాతాలో స్పందిస్తూ.. ‘మన (పురుషుల) నుంచి దేశంలోని మహిళలను ఎవరు కాపాడతారు? భూమిపై ఉన్న పనికిరాని చెత్త పురుషులం.. మనమే. నాకు చాలా సిగ్గుగా ఉంది. నన్ను క్షమించండి...’ అని సిద్ధార్థ్ అన్నాడు. మహిళలు తమకు ఎలాంటి వస్త్రాలు ధరించాలనిపిస్తే వాటినే ధరిస్తారని, దీనిని సాకుగా చూపుతూ వారిని వేధించే వారు దానికి స్వస్తి పలకాలని సూచించాడు. అత్యాచారం, లైంగిక వేధింపుల సంఘటనలకు ఏదీ న్యాయం చేయలేదని, ఏదైనా ఒక ఘటనను చూస్తే మారాలని, ఆలోచనా విధానాన్ని మార్చుకోవాలని ఆ ట్వీట్ లో సిద్ధార్థ్ కోరాడు.