: మూడేళ్లయినా కదలరేం?: చంద్రబాబుకు ముద్రగడ సూటి ప్రశ్న


అధికారంలోకి వచ్చి మూడు సంవత్సరాలు గడుస్తున్నా, కాపులకు ఇచ్చిన హామీలను చంద్రబాబు అమలు చేయడం లేదని ముద్రగడ పద్మనాభం ఆరోపించారు. ఈ ఉదయం చంద్రబాబుకు లేఖ రాసిన ఆయన, ఎన్నికల మ్యానిఫెస్టోలో ఇచ్చిన హామీలను సైతం చంద్రబాబు అమలు చేయడం లేదని, కాపు జాతి మొత్తానికీ ఆయన అన్యాయం చేస్తున్నారని నిప్పులు చెరిగారు. తక్షణం కాపులకు రిజర్వేషన్లు ప్రకటించకుంటే, వచ్చే అన్ని ఎన్నికల్లో కాపుల ఓట్లను ఆయన దక్కించుకోలేరని విమర్శించారు. కాపుల ఉద్యమాన్ని అణచివేసేందుకు చంద్రబాబు కుట్ర చేస్తున్నారని ఆరోపించిన ముద్రగడ, ఇప్పటికే కాపులు రోడ్డు మీదకు వచ్చి ఆందోళనలు చేస్తున్నారని, ఇవి మరింత ఉద్ధృతం కాకముందే చంద్రబాబు స్పందించాలని డిమాండ్ చేశారు. ఇప్పటికైనా ఇచ్చిన హామీని అమలు చేసే దిశగా చంద్రబాబు ప్రభుత్వం చర్యలు తీసుకోకుంటే, తమ ఆగ్రహాన్ని చవి చూడక తప్పదని హెచ్చరించారు.

  • Loading...

More Telugu News