: ఇంత మంది వస్తారని అనుకోలేదు... అన్న ప్రసాదాలకు లోటు లేదు: టీటీడీ ఈఓ


ముక్కోటి ఏకాదశి సందర్భంగా తిరుమలకు ఇంత మంది భక్తులు వస్తారని తాము ఊహించలేదని, ఇప్పటికే లక్ష మందికి పైగా క్యూలైన్లలో వేచి వుండగా, మరో లక్షన్నర మంది భక్తులు దర్శనం కోసం వచ్చారని, నేడు, రేపు ఉదయం వరకూ మరింతమంది భక్తులు రావచ్చని భావిస్తున్నామని టీటీడీ ఈఓ సాంబశివరావు వెల్లడించారు. భక్తుల సౌకర్యాలను తీర్చేందుకు భారీ ఎత్తున అన్నప్రసాదాలను సిద్ధం చేశామని తెలిపారు.

కంపార్టుమెంట్లలో ఖాళీ లేకనే మాడవీధుల్లో భక్తులను ఉంచాల్సి వచ్చిందని తెలిపారు. దర్శనం చేసుకున్న భక్తులు సాధ్యమైనంత త్వరగా తిరుపతికి బయలుదేరాలని ఆయన కోరారు. కంపార్టుమెంట్లు ఖాళీ అయితే, బయటున్న భక్తులను లోనికి అనుమతిస్తామని అన్నారు. భక్తుల సౌకర్యార్థం 6 లక్షల లడ్డూలను సిద్ధం చేశామని, రేపు రాత్రి వరకూ కూడా ఉత్తర ద్వార దర్శనం ఉంటుందని తెలిపారు. అన్న ప్రసాదాలకు లోటు లేదని, తెల్లవారుజామున 4 గంటల నుంచే అన్న ప్రసాదాలు పంచుతున్నామని, ఇప్పుడు తిరుమలలో ఉన్న ప్రతి ఒక్కరికీ స్వామివారి దర్శనం అవుతుందని పేర్కొన్నారు.

  • Loading...

More Telugu News