: హైదరాబాద్‌లో మందుబాబులకు షాక్.. వారంపాటు బహిరంగంగా మద్యం తాగడం నిషేధం
హైదరాబాద్‌లో మందుబాబులకు పోలీస్ కమిషనర్ మహేందర్‌రెడ్డి షాకిచ్చారు. హైదరాబాద్ కమిషనరేట్ పరిధిలో వారం పాటు బహిరంగంగా మద్యం తాగడాన్ని నిషేధిస్తూ ఆదేశాలు జారీ చేశారు. రేపటి(సోమవారం) నుంచి 15వ తేదీ వరకు ఈ ఆంక్షలు అమల్లో ఉంటాయని తెలిపారు. నగరంలోని చాలా ప్రాంతాల్లో మందుబాబులు బహిరంగంగా మద్యం తాగి ప్రజలను ఇబ్బందులకు గురి చేస్తున్నట్టు తమ దృష్టికి రావడంతో ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలిపారు. మహిళలు, పిల్లల భద్రతను దృష్టిలో పెట్టుకుని ఈ నిర్ణయం తీసుకున్నట్టు పేర్కొన్నారు. దీనిని ఉల్లంఘించిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని కమిషనర్ హెచ్చరించారు.