: వినాయక్ దర్శకుడే కాదు, నిర్మాత బాధ్యత కూడా తీసుకున్నారు!: రామ్ చరణ్


ఖైదీ నెంబర్ 150 సినిమాకి వీవీ వినాయక్ కేవలం దర్శకుడు మాత్రమే కాదని, నిర్మాతగా కూడా బాధ్యతలు నిర్వర్తించారని ఈ సినిమా నిర్మాత, నటుడు రామ్ చరణ్ తెలిపాడు. హాయ్ లాండ్ లో నిర్వహించిన ఖైదీ నెంబర్ 150 సినిమా ప్రీ రిలీజ్ ఫంక్షన్ లో ఆయన మాట్లాడుతూ, ఈ సినిమాకు చాలా మంది కష్టపడి పని చేశారని వారందరికీ ధన్యవాదాలు తెలుపుతున్నానని అన్నారు. చిరంజీవిని చూపించేందుకు ఎలాంటి సినిమా అయితే బాగుటుందో అలాంటి సినిమా దొరికిందని, ఈ సినిమాకు పని చేసిన అందరూ న్యాయం చేశారని ఆయన చెప్పారు. నిర్మాతగా తొలిసినిమాకు అందరూ సహకరించారని ఆయన అన్నారు. 

  • Loading...

More Telugu News