: యండమూరి, రాంగోపాల్ వర్మపై నిప్పులు చెరిగిన నాగబాబు
ప్రముఖ రచయిత యండమూరి వీరేంద్రనాధ్, ప్రముఖ దర్శకుడు రామ్ గోపాల్ వర్మపై నటుడు నాగబాబు విరుచుకుపడ్డారు. రామ్ చరణ్ లో టాలెంట్ లేకపోతే... ఎన్ని సర్జరీలు చేసినా ఫలితం లేదంటూ గతంలో యండమూరి వీరేంద్రనాధ్ పేర్కొన్న సంగతి తెలిసిందే. దీనిపై పెను దుమారమే లేచింది. ఈ వేదికగా నాగబాబు ఆయనపై విరుచుకుపడ్డారు. 'వాడో కుసంస్కారి' అన్నారు. 'వాడు వ్యక్తిత్వ వికాస పాఠాలు చెబుతాడు, వాడికి వ్యక్తిత్వం లేదు. అలాంటి వాడు మైలేజ్ కోసం చేసే వ్యాఖ్యలు మాకు ఎలాంటి నష్టాన్ని చేకూర్చవు' అంటూ మండిపడ్డారు.
అలాగే ముంబైలో కూర్చుని ట్విట్టర్ లో మరొకడు వాగుతుంటాడు. 'వాడికి సినిమాలు తీయడం చేతకావడంలేదని, ఇప్పుడు మాత్రం ఏదో ఒకటి వాగి ఫేమ్ తెచ్చుకోవాలని ప్రయత్నిస్తుంటాడని అన్నారు. వాడు మర్యాదగా ఉంటే బాగుటుందని ఈ వేదిక సాక్షిగా చెబుతున్నానని ఆయన హెచ్చరించారు. తమ ఫ్యామిలీని ఏదో అనడం ద్వారా మైలేజీ తెచ్చుకోవాలని ప్రయత్నిస్తున్నారని ఆయన మండిపడ్డారు.