: కోమటిరెడ్డి ఇంట్లో విందు ఆరగించిన జానా, ఉత్తమ్
నల్గొండలోని తన సొంత నివాసంలో పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి, సీఎల్పీ నేత జానారెడ్డిలకు ఎమ్మెల్యే కోమటిరెడ్డి వెంకటరెడ్డి విందు ఇచ్చారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ కార్యకర్తలు భారీ ఎత్తున అక్కడకు చేరుకున్నారు. అనంతరం, కాంగ్రెస్ నేతలు ముగ్గురూ మీడియాతో మాట్లాడుతూ ముఖ్యమంత్రి కేసీఆర్ పై విమర్శలు కురిపించారు. తెలంగాణను కేసీఆర్ దివాలా తీయిస్తున్నారని విమర్శించారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను నెరవేర్చడంలో కేసీఆర్ విఫలమయ్యారని అన్నారు. ఎస్సీ, ఎస్టీ సబ్ ప్లాన్ నిధులను దారి మళ్లించారని ఆరోపించారు. అసెంబ్లీలో విపక్ష పార్టీలన్నీ కలసికట్టుగా పోరాడతామని చెప్పారు. ప్రజలంతా తమతో కలసిరావాలని పిలుపునిచ్చారు.