: దాసరితో భేటీ అయిన బుద్ధా వెంకన్న, జలీల్ ఖాన్
ప్రముఖ దర్శకుడు దాసరి నారాయణరావు విజయవాడ చేరుకున్నారు. చిరంజీవి 150వ సినిమా 'ఖైదీ నెంబర్ 150' ప్రీరిలీజ్ ఫంక్షన్ కు ముఖ్య అతిథిగా హాజరుకానున్న నేపథ్యంలో ఆయన విజయవాడ చేరుకున్నారు. ఓ హోటల్ లో బస చేసిన దాసరి నారాయణరావును టీడీపీ ఎమ్మెల్సీ బుద్ధా వెంకన్న, ఎమ్మెల్యే జలీల్ ఖాన్ కలిశారు. ఈ సందర్భంగా పలు అంశాలపై వారు చర్చించారు. నేటి సాయంత్రం ఆయన హాయ్ ల్యాండ్ చేరుకోనున్నారు.