: 'ఖైదీ నంబర్ 150' సినిమాపై స్పందించిన పవన్ కల్యాణ్


చిరంజీవి 150వ చిత్రం 'ఖైదీ నంబర్ 150' సినిమా పట్ల ప్రముఖ నటుడు, జనసేన అధినేత పవన్ కల్యాణ్ స్పందించారు. "చరణ్, మా వదిన సురేఖ గారి నిర్మాణంలో వస్తున్న తొలి చిత్రమే చిరంజీవి గారి 150వ చిత్రం కావడం నాకు చాలా ఆనందంగా ఉంది. ఖైదీ నంబర్ 150 ప్రేక్షకులను అలరిస్తుందని నమ్ముతున్నాను. ఈ చిత్రంలోని నటీనటులకు, సాంకేతిక నిపుణులకు నా మన:పూర్వక శుభాకాంక్షలు", అంటూ పవన్ తన ట్విట్టర్ అకౌంట్ ద్వారా తెలిపారు.

  • Loading...

More Telugu News