: హద్దు మీరితే తాట తీస్తాం!... చిరంజీవి, బాలయ్య అభిమానులకు ఏపీ డీజీపీ సీరియస్ వార్నింగ్!
ఈ సంక్రాంతికి చిరంజీవి 150వ సినిమా, బాలకృష్ణ 100వ సినిమాలు విడుదల కానుండటంతో... అభిమానుల్లో తీవ్ర ఉత్కంఠ నెలకొంది. తమ అభిమాన హీరో సినిమానే హిట్ అవుతుందని, సంక్రాంతి మాదే అంటూ అభిమానులు సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో 'ఖైదీ నంబర్ 150', 'గౌతమీపుత్ర శాతకర్ణి' సినిమాలపై ఏపీ డీజీపీ సాంబశివరావు పోలీసు ఉన్నతాధికారులతో సమీక్ష నిర్వహించారు.
అనంతరం ఆయన మాట్లాడుతూ చిరంజీవి, బాలయ్య అభిమానులకు వార్నింగ్ ఇచ్చారు. ఎదుటి హీరో బ్యానర్లు, పోస్టర్లను చింపితే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. హీరోలను కించపరుస్తూ సోషల్ మీడియాలో పోస్టింగులు పెడితే, చట్టపరమైన చర్యలు తీసుకుంటామని తెలిపారు. ఇరు హీరోల అభిమానులు హద్దుల్లో ఉండాలని... హద్దుమీరితే తాట తీస్తామని హెచ్చరించారు.