: ఎన్నికల ముందు బడ్జెట్ ఎందుకు?.. స్పందించండి: కేంద్ర సర్కారుకి ఈసీ లేఖ
ఉత్తరప్రదేశ్, గోవా, ఉత్తరాఖండ్, పంజాబ్, మణిపూర్ రాష్ట్రాల్లో జరగనున్న ఎన్నికలకు కేంద్ర ఎన్నికల సంఘం ఇటీవలే ప్రకటన చేసిన విషయం తెలిసిందే. ఆయా రాష్ట్రాల అసెంబ్లీలకు ఫిబ్రవరి 4 నుంచి మార్చి 8 వరకు ఎన్నికలు నిర్వహిస్తామని ఆ ప్రకటనలో తెలిపింది. మరోవైపు ఫిబ్రవరి 1న కేంద్ర ప్రభుత్వం బడ్జెట్ ప్రవేశపెట్టాలని యోచిస్తోంది. ఈ నేపథ్యంలో ఆ బడ్జెట్ ఎన్నికలను ప్రభావితం చేసేలా ఉంటోందని సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలయింది. ఇప్పటికే ఈ వ్యాజ్యాన్ని అత్యవసర వాదనల కిందట విచారించేందుకు సుప్రీంకోర్టు కోర్టు నిరాకరించింది.
ఈ నేపథ్యంలో ఈ విషయంపై కేంద్ర ఎన్నికల కమిషన్ స్పందించింది. విపక్షాలు తెలుపుతున్న అభ్యంతరాలపై ప్రాథమిక చర్యగా కేంద్ర ప్రభుత్వం స్పందన తెలపాలని కేంద్ర కేబినెట్ కార్యదర్శికి ఈ రోజు ఓ లేఖ రాసింది. ప్రతిపక్ష పార్టీల నేతలు ఇటీవలే ఈసీకి లేఖ రాసి, మార్చి8 బడ్జెట్ ప్రవేశపెట్టేలా కేంద్రాన్ని ఆదేశించాలని కోరాయి. ఈ రోజు ఈసీ కేంద్ర ప్రభుత్వానికి రాసిన లేఖపై ఎలాంటి స్పందన వస్తుందో చూడాలి.