: తనకెంతో ఇష్టమైన పదవి నుంచి తప్పుకున్న స్టాలిన్!
డీఎంకే వర్కింగ్ ప్రెసిడెంట్ గా ఎన్నికైన స్టాలిన్ తనకు ఎంతో ఇష్టమైన డీఎంకే యూత్ విభాగం కార్యదర్శి పదవి నుంచి తప్పుకున్నారు. గత మూడున్నర దశాబ్దాలుగా ఆయన ఈ పదవిని నిర్వహించారు. 1980-81లో యూత్ విభాగాన్ని స్టాలినే స్వయంగా ఏర్పాటు చేశారు. అప్పటి నుంచి దానికి సంబంధించిన బాధ్యతలను ఆయనే మోస్తున్నారు. గతంలో డిప్యూటీ సీఎంగా పనిచేసినప్పుడు కూడా ఆయన ఆ పదవిని వదల్లేదు. యూత్ వింగ్ కార్యదర్శి బాధ్యతలను పార్టీ కీలక నేత సామినాథన్ కు అప్పగించారు. సామినాథన్ మూడు పర్యాయాలు ఎమ్మెల్యేగా గెలిచారు. మంత్రిగా కూడా పని చేశారు.