: ఐఆర్‌సీటీసీ యాప్‌కు కొత్త క‌ళ‌.. త్వ‌ర‌లో అందుబాటులోకి!


ఐఆర్‌సీటీసీ యాప్ కొత్త హంగుల‌తో రాబోతోంది. ప్ర‌స్తుతం ఉన్న యాప్‌కు అత్యాధునిక సాంకేతిక ప‌రిజ్ఞానం జోడించి మ‌రిన్ని మెరుగుల‌ద్దారు. రైలు టికెట్ల‌ను మ‌రింత సుల‌భంగా, వేగంగా కొనుగోలు చేసుకునేలా తీర్చిదిద్దారు. అతి త్వ‌ర‌లోనే ఈ యాప్ అందుబాటులోకి రానుందని రైల్వే మంత్రిత్వ‌శాఖ సీనియ‌ర్ అధికారి ఒక‌రు తెలిపారు. నెక్స్ట్ జ‌న‌రేష‌న్ ఈ-టికెటింగ్ విధానానికి అనుగుణంగా యాప్‌ను అభివృద్ధి చేసిన‌ట్టు పేర్కొన్నారు. ఐఆర్‌సీటీసీ వెబ్‌సైట్‌తో కూడా ఈ యాప్ అనుసంధానం అవుతుంద‌ని ఆయ‌న వివ‌రించారు.

  • Loading...

More Telugu News