: అలసిన ఐష్.. అత్తపై వాలిపోయింది ఇలా!
‘సరబ్ జిత్’ చిత్రంలో తన నటనకు గాను స్టార్ స్క్రీన్ అవార్డ్స్ ఉత్తమ నటి అవార్డును ఐశ్వర్యారాయ్ గెలుచుకున్న విషయం తెలిసిందే. ఇటీవల ముంబయిలో జరిగిన ఈ ఫంక్షన్ లో ఐష్ ఆ అవార్డును బిగ్ బీ అమితాబ్ బచ్చన్ చేతుల మీదుగా అందుకుంది. ఇక విషయంలోకి వస్తే, ఆ అవార్డు ఫంక్షన్ కార్యక్రమానికి ఐష్ అత్తగారు జయాబచ్చన్ కూడా హాజరయ్యారు. ఈ కార్యక్రమం జరుగుతున్న సమయంలో కొంచెం అలసట చెందినట్లు కనిపించిన ఐష్, తన పక్కనే కూర్చున్న జయాబచ్చన్ భుజంపై వాలిపోయింది.
అదేసమయంలో, ఈ దృశ్యం మీడియా కెమెరాలకు చిక్కింది. ఆ ఫొటో సామాజిక మాధ్యమాలకు చేరి వైరల్ గా మారింది. కాగా, ఈ మధ్య విడుదలైన 'ఏ దిల్ హై ముష్కిల్' చిత్రంలో రణ్ బీర్ కపూర్ సరసన ఐశ్యర్య నటించింది. ఈ చిత్రంలో కొన్ని సన్నివేశాల్లో ఐష్ శ్రుతి మించి నటించిందని, ఈ విషయమై ఆమె అత్తమామలు అమితాబ్, జయా బచ్చన్ లు మండిపడ్డారని, ఒకరి మొఖం మరొకరు చూసుకోవడం లేదంటూ వార్తలు హల్ చల్ చేశాయి. ఆ వదంతులకు ఈ ఫొటోనే చెక్ పెట్టిందని ఐష్ అభిమానులు అంటున్నారు.