: భారతీయ మత్స్యకారులను విడుదల చేసిన పాకిస్థాన్


తమ దేశ జైళ్లలో మగ్గుతున్న భారతీయ జాలర్లను పాకిస్థాన్‌ విడుదల చేసింది. పఠాన్ కోట్, యురీ దాడుల అనంతరం భారత్, పాకిస్థాన్ మధ్య తీవ్ర ఉద్రిక్తతలు నెలకొన్నాయి. ఈ ఘటనల అనంతరం రెండు దేశాల మధ్య సంబంధాలు తీవ్రంగా దెబ్బతిన్నాయి. వీటిని చక్కబరిచేందుకు పాక్ ప్రయత్నాలు ప్రారంభించింది. తద్వారా భారత్ తో ఏర్పడిన ఉద్రిక్తతలు చల్లబరిచేందుకు పావులు కదిపింది. ఈ క్రమంలో పాకిస్థాన్ జైళ్లలో సుదీర్ఘ కాలంగా మగ్గుతున్న 218 మందికి విముక్తి కల్పించి, కరాచీ నుంచి భారత్‌ కు పంపించింది.

వాస్తవానికి 219 మందిని విడుదల చేయాల్సి ఉండగా విడుదలకు కొన్ని గంటల ముందు జీవా భగవాన్‌ అనే ఖైదీ గుండెపోటుతో మృతి చెందినట్లు పాక్‌ పోలీసులు వెల్లడించారు. దీంతో 218 మందిని భారత్ కు పంపుతున్నట్టు తెలిపారు. దీంతో పాకిస్థాన్‌ ప్రభుత్వం గత పది రోజుల్లో 349 మంది భారత ఖైదీల్ని విడుదల చేసింది. దీంతో గత క్రిస్మస్ సందర్భంగా (డిసెంబర్‌ 25న) 2,220 మందిని విడుదల చేసి, భారత్‌ కు పంపిన సంగతి తెలిసిందే. దీంతో గత మూడు వారాల్లో పాక్‌ మొత్తం 2,569 మందిని విడుదల చేసి భారత్ కు పంపింది. 

  • Loading...

More Telugu News