: ములాయం సింగ్ కు మరో షాకిచ్చిన అఖిలేష్ యాదవ్


సమాజ్ వాదీ పార్టీలో ఏర్పడ్డ విభేదాలు మరింత జటిలమయ్యాయని తాజాగా ఏర్పడిన పరిస్థితులను చూస్తే అర్థమవుతుంది. సమాజ్ వాదీ పార్టీపై ఆధిపత్యం కోసం జరుగుతున్న పోరులో అఖిలేశ్ యాదవ్ నెమ్మదిగా పట్టుబిగిస్తున్నారు. ఓ వార్తా సంస్థ వెల్లడించిన కథనం ప్రకారం, అఖిలేశ్ యాదవ్ పార్టీ వ్యవస్థాపక అధినేత ములాయం సింగ్ యాదవ్ కు మరోషాక్ ఇచ్చినట్టు తెలుస్తోంది. అఖిలేష్ వర్గం సమాజ్ వాదీ పార్టీకి చెందిన బ్యాంకు ఖాతాలను స్తంభింపజేయాలని బ్యాంకులను కోరినట్లు తెలిపింది.

దీంతో బ్యాంకులు సమాజ్ వాదీ పార్టీ ఖాతాలను స్తంభింపజేసినట్లు తెలుస్తోంది. ఈ ఖాతాల్లో పార్టీకి చెందిన 500 కోట్ల రూపాయలు ఉన్నట్లు అంచనా వేస్తుండగా, ఇంతవరకు ఈ ఖాతాల లావాదేవీలను శివపాల్ యాదవ్ నిర్వహించేవారు. ఆయన సంతకం లేకుండా ఈ ఖాతాల్లోంచి ఒక్క రూపాయి కూడా బయటకు వెళ్లేది కాదు.  

  • Loading...

More Telugu News