: ఈ సీజన్ లో తొలి స్వైన్ ఫ్లూ కేసు నమోదు
ఈ సీజన్ లో వచ్చే స్వైన్ ఫ్లూ వ్యాధి తొలి కేసు ఉత్తరప్రదేశ్ లోని లక్నోలో నమోదైంది. 60 సంవత్సరాల మహిళ ఈ వ్యాధి బారిన పడినట్లు ఉన్నతాధికారి ఒకరు ఈరోజు పేర్కొన్నారు. దగ్గు, జలుబు, తీవ్ర జ్వరంతో బాధపడుతున్న మహిళ లక్నోలోని ఒక ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స కోసం చేరిందని, ఆమె బ్లడ్ శాంపిల్స్ ను పరీక్షించగా, హెచ్ 1ఎన్1 వైరస్ ను గుర్తించినట్లు సదరు అధికారి పేర్కొన్నారు. స్వైన్ ఫ్లూ సోకిన మహిళను ప్రత్యేక వార్డుకు తరలించి చికిత్స అందిస్తున్నట్లు వైద్యులు తెలిపారు.