: కష్టాల్లో పాకిస్థాన్.. జోరు మీదున్న ఆసీస్!


ఆస్ట్రేలియాతో జరుగుతున్న మూడో టెస్టులో పాకిస్థాన్‌ జట్టు క్లీన్ స్వీప్ ముంగిట నిలిచింది. నిలకడ లేమితో పాక్ జట్టు కష్టాలు ఎదుర్కొంటోంది. తొలుత బ్యాటింగ్ చేసిన ఆస్ట్రేలియా జట్టు 538/9 పరుగుల వద్ద డిక్లేర్ చేసింది. అనంతరం పాక్ తొలి ఇన్నింగ్స్‌ లో 315 పరుగులకే కుప్పకూలింది. తరువాత రెండో ఇన్నింగ్స్ లో ఆస్ట్రేలియా జట్టు రెండు వికెట్ల నష్టానికి 241 పరుగులు చేసింది.

అనంతరం బ్యాటింగ్ ప్రారంభించిన పాక్ జట్టు ఒక వికెట్ కోల్పోయి 55 పరుగులు సాధించింది. ఇంకా ఒకరోజు ఆట మిగిలిఉండగా, పాక్ జట్టు విజయం సాధించాలంటే ఇంకా 411 పరుగులు చేయాలి. ఈ నేపథ్యంలో నిలకడలేమికి మారుపేరైన పాకిస్థాన్ జట్టు రాణించి మ్యాచ్ ను డ్రాగా ముగిస్తుందా? లేక రెండో టెస్టులా చతికిలపడి కుప్పకూలి క్లీన్ స్వీప్ అవుతుందా? అన్నది రేపు తేలిపోనుంది. 

  • Loading...

More Telugu News