: యువరాజ్ ను వన్డే జట్టులోకి మళ్లీ తీసుకోవడానికి కారణమిదే!
ఇంగ్లండ్ తో జరగనున్న వన్డే సిరీస్ కు బీసీసీఐ జట్టును ఎంపిక చేసింది. చీఫ్ సెలెక్టర్ ఎంఎస్కే ప్రసాద్ జట్టును మీడియా ముందు ప్రకటించాడు. అయితే, ఊహించని విధంగా స్టార్ క్రికెటర్ యువరాజ్ సింగ్ జట్టులోకి వచ్చాడు. ఈ సందర్భంగా, యువరాజ్ ను తీసుకోవడానికి గల కారణాన్ని ప్రసాద్ వివరించాడు.
"డొమెస్టిక్ క్రికెట్ (దేశవాళీ)లో యువరాజ్ చాలా బాగా రాణించాడు. ఈ విషయంలో అతన్ని ప్రశంసించాలి. యువరాజ్ లాంగ్ ఇన్నింగ్స్ ఆడలేడని ఇన్నాళ్లు భావించాం. కానీ, ఇటీవల కాలంలో యవీ అద్భుతమైన క్రికెట్ ఆడాడు. ఒక డబుల్ సెంచరీ చేశాడు. అనుకూలించని వికెట్ పై మరోసారి 180 పరుగులు చేశాడు. డొమెస్టిక్ క్రికెట్ లో కనబరిచిన ఆట వల్లే యువీకు వన్డే టీమ్ లో అవకాశం కల్పించాం" అని ఎమ్మెస్కే తెలిపాడు.