: వెండితెర నటఝరి.. ఓంపురి!


హావభావాలను అవలీలగా పలికించి, గంభీరమైన స్వరంతో డైలాగ్ లు చెప్పి మెప్పించి, తనకు తానే సాటిగా నిలిచి.. భారతీయ చలన చిత్ర రంగంలో తనదైన ముద్ర వేసి.. ప్రేక్షకుల హృదయాల్లో చిరస్థాయిగా నిలిచిపోయిన విలక్షణ నటుడు ఓంపురి. ఈరోజు ఉదయం ముంబయిలోని తన నివాసంలో కన్నుమూశారు. ‘ఓంపురి.. నట శిఖరం’ అని భారత దేశ చలనచిత్రరంగానికి చెందిన ప్రముఖులే కాదు‘హాలీవుడ్’  ప్రముఖులు సైతం పేర్కొనడం తెలిసిందే.  అటువంటి ‘నట శిఖరం’ జీవిత విశేషాలు..

* పంజాబ్ లోని అంబాలాలో ఓంపురి జన్మించారు
*ఆయన తండ్రి రైల్వేలో, ఇండియన్ ఆర్మీలో పని చేశారు
* ఓం పురి ఫలానా తేదీన, సంవత్సరంలో పుట్టారని చెప్పడానికి వాస్తవానికి ఎటువంటి ఆధారాలు లేవు. ఓంపురి తల్లి చెప్పిన దానిని బట్టి, దసరా పండగ తర్వాత రెండురోజులకు ఓంపురి జన్మించారట
* ఓంపురిని పాఠశాలలో చేర్పించిన సమయంలో ఆయన డేట్ ఆఫ్ బర్త్ 1950 మార్చి 9గా ఉంది. ఈ పుట్టిన తేదీని ఓంపురిని పాఠశాలలో వేస్తున్నప్పుడు ఆయన అంకుల్ నమోదు చేయించారు.
* అయితే, ఓంపురి పెరిగి పెద్దయి ముంబయికి వచ్చిన తర్వాత తన పుట్టిన తేదీని అక్టోబర్ 18గా మార్చుకున్నారట
* పుణెలోని ఫిల్మ్ అండ్ టెలివిజన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఇండియాలో ఓంపురి  గ్రాడ్యుయేషన్ పూర్తి చేశారు
* 1973లో నేషనల్ స్కూల్ ఆఫ్ డ్రామా (ఎన్ఎస్ డీ) విద్యార్థి, ప్రముఖ నటుడు అయిన నసీరుద్దీన్ షాకు సీనియర్ స్టూడెంట్    ఓంపురి
*1976లో మరాఠీ చిత్రం ‘ఘాశీరామ్ కొత్వాల్’తో సినీ రంగ ప్రవేశం
* తెలుగుకి ‘అంకురం’ చిత్రం ద్వారా ఓంపురి పరిచయమయ్యారు
* 1982లో ‘ఆరోహణ్’,1984లో ‘అర్థ్ సత్య’ చిత్రాలకు జాతీయ ఉత్తమనటుడిగా, 8 సార్లు ఫిలింఫేర్ అవార్డులు అందుకున్నారు
* 1990లో భారత ప్రభుత్వ ‘ పద్మశ్రీ’పురస్కారం పొందారు
* హాలీవుడ్ సినిమాల్లోను నటించిన ఓంపురి, హిందీ టెలివిజన్ సీరియల్స్ కాకాజీ కహాని, మిస్టర్ యోగి, సూత్రధార్ లో తనదైన నటనను కనబరిచారు
 * నటి అన్నూ కపూర్ సోదరి సీమా కపూర్ ను 1991లో ఓంపురి వివాహం చేసుకున్నారు. వారి వైవాహిక బంధం ఎక్కువ కాలం కొనసాగలేదు.
* 1993లో జర్నలిస్టు నందితా పూరిని వివాహం చేసుకున్నారు. ఓంపురి, నందితా పూరికి ఇషాన్ అనే కుమారుడు ఉన్నాడు
* 2009లో ‘అన్ లైక్లీ హీరో: ది హిస్టరీ ఆఫ్ ఓంపురి’ అనే ఆటోబయోగ్రఫీని ఆయన భార్య  రాసింది. తన పూర్వ సంబంధాల గురించి ఈ పుస్తకంలో ఉండటంపై ఓంపురి నాడు ఆగ్రహం వ్యక్తం చేశారు
* ఓంపురి తనపై గృహ హింసకు పాల్పడ్డారని భార్య ఆరోపణల నేపథ్యంలో 2013లో వారు విడిపోయారు.

  • Loading...

More Telugu News