: పేషెంట్లకు వైరస్ ఎక్కిస్తున్న సెల్ ఫోన్లు: శాస్త్రవేత్తలు
మొబైల్ ఫోన్ల ద్వారా హానికారక బ్యాక్టీరియా వ్యాపిస్తోందని శాస్త్రవేత్తలు గుర్తించారు. ముఖ్యంగా ఆసుపత్రుల్లో దీని తీవ్రత ఎక్కువగా ఉందని వారు అంటున్నారు. ఐసీయూ, ఆపరేషన్ థియేటర్లు, మెడికల్ వార్డుల్లోకి మొబైల్ ఫోన్లు తీసుకెళితే... వాటి ద్వారా రోగులకు వైరస్ వ్యాపిస్తుందని శాస్త్రవేత్తలు హెచ్చరించారు. ఆసుపత్రిలోకి డాక్టర్లు, నర్సులు, ఇతర సిబ్బంది సెల్ ఫోన్లను తీసుకెళ్లవద్దని హెచ్చరించారు. ఈ విషయాన్ని తిరుపతిలో జరుగుతున్న సైన్స్ కాంగ్రెస్ లో వెల్లడించారు. డాక్టర్లు, నర్సుల వద్ద ఉన్న వంద మొబైల్స్ ను పరిశీలిస్తే... అందులో 56 ఫోన్లలో వైరస్ ఉన్నట్టు శాస్త్రవేత్తలు గుర్తించారు. టచ్ స్క్రీన్ మొబైల్స్ లో ఈకోలీ బ్యాక్టీరియా ఉండటం ఆందోళన కలిగిస్తోందని తెలిపారు.