: కోళ్లను స్వాధీనం చేసుకోవద్దు... ఏపీ పోలీసులకు ఆదేశాలు జారీ చేసిన సుప్రీంకోర్టు


ఆంధ్రప్రదేశ్ సంక్రాంతి శోభ సంతరించుకుంటోంది. అయితే, సంక్రాంతి సందర్భంగా కోస్తాంధ్రలో అత్యంత ప్రతిష్ఠాత్మకంగా నిర్వహించే కోడిపందేలపై సుప్రీంకోర్టు స్పందించింది. కోడి పందేలు నిర్వహించరాదని హైకోర్టు ఇచ్చిన తీర్పును సవాల్‌ చేస్తూ బీజేపీ నేత రఘురామకృష్ణంరాజు దాఖలు చేసిన పిటిషన్‌ ను విచారణకు స్వీకరించిన అత్యున్నత న్యాయస్థానం ప్రతివాదులకు నోటీసులు జారీచేసింది.

ఈ సందర్భంగా పలు కీలక వ్యాఖ్యలు చేసింది. పందెం రాయుళ్లను అదుపు చేయడానికని చెప్పి, పందెం కోళ్లను పోలీసులు స్వాధీనం చేసుకోరాదని ఆదేశించింది. ప్రతిఏటా పందెం రాయుళ్ల భరతం పట్టే క్రమంలో పందెంకోళ్లను పోలీసులు స్టేషన్ కు తరిలిస్తున్న సంగతి తెలిసిందే. 

  • Loading...

More Telugu News