: మంత్రులకు వీధి భోజనం పెట్టించిన అధ్యక్షుడు
ఇండొనేషియాలో విచిత్రమైన ఘటన చోటు చేసుకుంది. దేశాధ్యక్షుడు జోకో విడొడొ ఉపాధ్యక్షుడు, కేబినెట్ మంత్రులతో సమావేశం నిర్వహించారు. సమావేశంలోనే వీరంతా భోజనం చేయాల్సి ఉంది. సాధారణంగా అయితే వీరికి ఖరీదైన రెస్టారెంట్ల నుంచి భోజనం తెప్పించడం కానీ లేదా అక్కడే ప్రత్యేకంగా వంటకాలు చేయించడం కానీ చేస్తారు. అయితే, రోడ్ల మీద ఉన్న తోపుడు బండ్ల వారిని ప్యాలెస్ కి పిలిపించారు జోకో. వాళ్లు వండిన వంటలను మంత్రులకు పెట్టారు. అంతేకాదు, ట్విట్టర్ ద్వారా ఈ విషయాన్ని అందరితో పంచుకున్నారు. భోజనానికి మీట్ బాల్స్, ఫ్రైడ్ రైస్, ఫ్రైడ్ బీన్ స్ప్రోట్స్ ఆర్డర్ ఇచ్చాం. వీధుల్లో అమ్మే వంటకాలు చౌకగా, చాలా రుచికరంగా ఉంటాయంటూ ట్వీట్ చేశారు. స్టేట్ ప్యాలెస్ ప్రజలందరికీ చేరువగా ఉండాలన్న ఆలోచనతోనే మంత్రులకు ఆయన ఇలాంటి భోజనం పెట్టించారట.