: కల్తీమద్యం పంపిణీ చేసింది వైసీపీ నేతలే.. నిగ్గు తేల్చిన సీఐడీ.. కాకాని, రామిరెడ్డి ప్రతాప్‌కుమార్‌రెడ్డిలపై చార్జిషీట్ దాఖలు
కల్తీమద్యం కేసులో నెల్లూరు జిల్లాకు చెందిన వైసీపీ ఎమ్మెల్యేలు కాకాని గోవర్ధన్‌రెడ్డి, రామిరెడ్డి ప్రతాప్‌కుమార్‌రెడ్డిలపై సీఐడీ చార్జిషీటు దాఖలు చేసింది. ఎన్నికల్లో వీరు కల్తీ మద్యం పంపిణీ చేశారని నిగ్గు తేల్చింది. 2014 ఎన్నికల సమయంలో చిత్తూరు, నెల్లూరు, ప్రకాశం, గుంటూరు, పశ్చిమ గోదావరి జిల్లాల్లో మొత్తం 32 కల్తీమద్యం కేసులు నమోదయ్యాయి. వీటిలో నెల్లూరు జిల్లాకు చెందిన 11 కేసుల్లో సీఐడీ విచారణ పూర్తిచేసింది. ఈ వ్యవహారంలో ఇద్దరు ఎమ్మెల్యేలు సహా మొత్తం 27 మందిని నిందితులుగా చార్జిషీట్‌లో పేర్కొంది.