: చిన్న సినిమాలే పరిశ్రమకు ఊపిరి: దర్శకుడు దాసరి నారాయణరావు
చిత్ర పరిశ్రమకు చిన్న సినిమాలే ఊపిరి అని ప్రముఖ దర్శకుడు దాసరి నారాయణరావు అన్నారు. ‘అప్పట్లో ఒకడుండేవాడు’ చిత్రం సక్సెస్ మీట్ హైదరాబాద్ లో ఈరోజు జరిగింది. దీనికి ముఖ్యఅతిథిగా విచ్చేసిన దాసరి మాట్లాడుతూ, చిన్న సినిమాలే పరిశ్రమకు ఊపిరి అని, ఆ చిత్రాలు బాగా ఆడాలని, అప్పుడే, దర్శకులు, నిర్మాతలు, నటీనటులు వెండితెరకు ఎక్కువగా పరిచయమయ్యే అవకాశం ఉంటుందని అన్నారు. కాగా, నారా రోహిత్, శ్రీవిష్ణు కీలక పాత్రల్లో నటించిన ఈ చిత్రానికి సాగర్ కె. చంద్ర దర్శకత్వం వహించారు.