: తమిళనాడు గవర్నర్ గా సినీ నటుడు కృష్ణంరాజు?


బీజేపీ సీనియర్ నాయకుడు, సినీ నటుడు కృష్ణంరాజును తమిళనాడు గవర్నర్ గా నియమిస్తారని మీడియాలో వార్తలు హల్ చల్ చేస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఆయన పేరును కేంద్రం పరిశీలిస్తోందని, కృష్ణంరాజు నియామకం ఖరారైందని వార్తలొస్తున్నాయి. కాగా, గత ఏడాదిలో తమిళనాడు గవర్నర్ గా కొణిజేటి రోశయ్య పదవీ కాలం ముగిసింది. ఆ తర్వాత తాత్కాలిక గవర్నర్ గా విద్యాసాగర్ రావును నియమించారు. ఈ నేపథ్యంలో తమిళనాడుకు పూర్తి స్థాయి గవర్నర్ ను నియమించే పనిలో కేంద్ర ప్రభుత్వం ఉంది. ఈ నేపథ్యంలోనే కృష్ణంరాజు పేరును పరిశీలిస్తోందని ఊహాగానాలు విన్పిస్తున్నాయి.

  • Loading...

More Telugu News