: ‘గౌతమి పుత్ర శాతకర్ణి’కి యూఏ సర్టిఫికెట్
ప్రముఖ నటుడు బాలకృష్ణ 100వ చిత్రం 'గౌతమి పుత్ర శాతకర్ణి' చిత్రానికి సెన్సార్ బోర్డు క్లియరెన్స్ ఇచ్చింది. ఈ చిత్రానికి కట్స్ ఏమీ లేకుండా యూఏ సర్టిఫికెట్ ఇచ్చింది. కాగా, ప్రముఖ దర్శకుడు క్రిష్ దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రం సంక్రాంతి పండగకు ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ చిత్రంలో బాలకృష్ణ, హేమమాలిని, శ్రియ తదితర నటులు నటించారు.