: వినూత్న ప్రయోగం చేస్తున్న‌ ముంబ‌యి స్టార్ట‌ప్ కంపెనీ.. ఆ చెత్త కుండీలో చెత్త‌వేస్తే వై-ఫై ఫ్రీ!


ముంబ‌యికి చెందిన ఓ స్టార్ట‌ప్ కంపెనీ పారిశుద్ధ్యాన్ని పెంచ‌డానికి ఓ వినూత్న ప్ర‌యోగం చేస్తోంది. అదే న‌గ‌రానికి చెందిన థింక్ స్క్రీమ్ అనే ఈ స్టార్టప్ కంపెనీ చెత్త వేయ‌డానికి వైఫై ట్రాష్ బిన్‌లను రూపొందించింది. ప్ర‌జ‌లు అందులో చెత్త వేస్తే చాలు 15 నిమిషాల పాటు ఉచిత‌ వైఫైని వాడుకోవచ్చని తెలిపింది. చెత్త‌కుండీలా ఉండే ఈ వైఫై ట్రాష్ బిన్‌ ఎత్తు నాలుగున్నర అడుగులు. స్టార్ట‌ప్ కంపెనీ ఉద్యోగులు దాని కింది భాగంలో ఓ ఇన్‌ఫ్రారెడ్ సెన్సార్‌ను అమ‌ర్చారు. ఈ సెన్సార్ అందులో పడిన చెత్తను గుర్తించి పై భాగంలో అమర్చిన ఎల్‌ఈడీ స్క్రీన్‌కు మెసేజ్ పంపుతుంది. వెంట‌నే ఆ మెసేజ్‌ను రిసీవ్ చేసుకున్న ఎల్‌ఈడీ స్క్రీన్‌పై ఒక‌ పాస్‌వర్డ్ క‌న‌ప‌డుతుంది.

అందులో చెత్త వేసిన వారు ఇక‌ ఈ పాస్ వ‌ర్డును తీసుకొని ట్రాష్ క్యాన్‌లో అమర్చిన వైఫై రూటర్‌కు కనెక్ట్ అయి 15 నిమిషాల వరకు ఉచితంగా వాడుకోవ‌చ్చు. ఆ హైటెక్‌ చెత్త‌కుండీకి 50 మీటర్ల ప‌రిధిలోనూ ఆ వైఫై సిగ్న‌ల్స్ అందుతాయి. ఇటీవ‌లే ఈ వైఫై ట్రాష్ బిన్‌లను తీసుకొచ్చారు. దీనికి మంచి స్పందన వస్తోంది. ఇక ముంబ‌యి అంత‌టా ఈ వై-ఫై ట్రాష్ బిన్‌ల‌ను ఉప‌యోగించ‌నున్నార‌ట‌.

  • Loading...

More Telugu News