: ఫిలిప్పీన్స్ బ్యూటీని అమెరికాలో కాల్చి చంపిన మాజీ భర్త
ఫిలిప్పీన్స్ బ్యాటీక్వీన్ గ్లాడిస్ టోర్డిల్ ను ఆమె మాజీ భర్త యులాలియో టోర్డిల్ కాల్చి చంపిన ఘటన అమెరికాలోని ప్రిన్స్ జార్జ్ టౌన్ స్కూల్ లో చోటుచేసుకుంది. ఫిలిప్పీన్ బ్యూటీక్వీన్ గ్లాడిస్ టోర్డిల్ కొన్నేళ్ల క్రితమే అమెరికాకు వలస వెళ్లారు. అక్కడి ప్రిన్స్ జార్జ్ కౌంటీ పబ్లిక్ స్కూల్ కెమిస్ట్రీ అధ్యాపకురాలిగా పని చేస్తున్నారు. ఫినిక్స్ యూనివర్సిటీ నుంచి ఆమె కెమిస్ట్రీలో మాస్టర్స్ చేశారు. ఈ దంపతులకు ఇద్దరు కుమార్తెలున్నారు. స్కూలు ముగిసిన అనంతరం పార్కింగ్ ప్రాంతానికి వెళ్లిన సమయంలో ఆమెపై కాల్పులు జరిగాయి. ఓ వ్యక్తి ఆమెను రక్షించే ప్రయత్నం చేసినప్పటికీ ఘోరం జరిగిపోవడం విశేషం. గ్లాడిస్ మాజీ భర్త ఆమెను మాత్రమే కాకుండా, మరో ఇద్దరిని కూయడ చంపాడంటూ పోలీసులు చెప్పారు .