: ధోనీ లాంటివారు మరొకరు లేరు: 'ధోనీ' సినిమా హీరో సుశాంత్ సింగ్ రాజ్ పుత్


టీమిండియా కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ పరిమిత ఓవర్ల క్రికెట్ కెప్టెన్సీ నుంచి తప్పుకోవడంపై బాలీవుడ్ నటులు స్పందించారు. ధోనీ బయోపిక్ లో నటించిన సుశాంత్ సింగ్ రాజ్ పుత్ ధోనీ నిర్ణయంపై ఆశ్చర్యం వ్యక్తం చేశాడు. దోనీ లాంటివారు మరొకరు లేరని అన్నాడు. మహీ గొప్ప కెప్టెన్ అని, భారత్ గర్వించే చిరస్మరణీయ విజయాలు అందించాడని పేర్కొన్నారు. ధోనీ సారథ్యంలో రెండు వరల్డ్ కప్ లు గెలవడం, టెస్టుల్లో నెంబర్ వన్ స్థానానికి వెళ్లడాన్ని ఎప్పటికీ గుర్తుంచుకుంటామని మరో బాలీవుడ్ నటుడు ఇర్ఫాన్ ఖాన్ తెలిపాడు. టీమిండియాలో గొప్ప కెప్టెన్ల యుగం ముగిసిందని మరో బాలీవుడ్ నటుడు రణ్ దీప్ హుడా వ్యాఖ్యానించాడు. 

  • Loading...

More Telugu News