: ఈ సంఘటనను వివాదం చేయదలచుకోలేదు: కేంద్ర మంత్రి బాబుల్ సుప్రియో


రెండు రోజుల క్రితం తన నివాసంపై తృణమూల్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు దాడికి పాల్పడిన సంఘటనను వివాదం చేయదలచుకోలేదని కేంద్ర మంత్రి బాబుల్ సుప్రియో అన్నారు. ఈరోజు ఆయన మీడియాతో మాట్లాడుతూ, ఈ దాడిలో తమ వారికి ఎటువంటి గాయాలు కాలేదని, సురక్షితంగా ఉన్నారని చెప్పారు. తృణమూల్’ దాడులకు పాల్పడటం సమంజసం కాదని, తనపై నిందారోపణలు చేసిన ఆ పార్టీ నేతలు సౌగత్ రాయ్, తపస్ పాల్, నందిని పాల్ పై పరువునష్టం కేసు వేయనున్నామని, ఇప్పటికే న్యాయవాదులను సంప్రదించినట్లు ఆయన చెప్పారు.

  • Loading...

More Telugu News