: ఒకే వేదికపై మోదీ, నితీష్ కుమార్!


బీహార్ రాజధాని పాట్నాలో ఆసక్తికర సన్నివేశం చోటు చేసుకుంది. రాజకీయ శత్రువులైన ప్రధాని నరేంద్ర మోదీ, బిహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ లు ఒకే వేదికపై ఆసీనులయ్యారు. స్థానికంగా ఉన్న గాంధీ మైదానంలో నిర్వహించిన గురుగోవింద్ సింగ్ 350వ జయంతి వేడుకల సందర్భంగా ఇద్దరూ వేదికను పంచుకున్నారు. బీజేపీ ప్రధాని అభ్యర్థిగా మోదీని ఎంపిక చేసిన తర్వాత ఆ పార్టీకి నితీష్ దూరమయ్యారు. అయితే, పెద్ద నోట్లను రద్దు చేస్తూ మోదీ తీసుకున్న నిర్ణయాన్ని ప్రశంసిస్తూ నితీష్ కుమార్ బహిరంగంగా స్పందించారు.

కాగా, ఈ వేడుకల సందర్భంగా నితీష్ పై మోదీ ప్రశంసలు కురిపించారు. దేశాన్ని ముందుకు నడిపించడంలో బీహార్ ఎప్పుడూ ముందుంటుందని మెదీ అన్నారు.

  • Loading...

More Telugu News