: తాను రేప్ చేసిన అమ్మాయిని 8 ఏళ్ల తర్వాత పెళ్లి చేసుకున్న ఖైదీ!
రేస్ కేసులో శిక్షను అనుభవిస్తున్న ఓ ఖైదీ చివరకు ఆమెనే పెళ్లి చేసుకున్నాడు. ఈ వివాహం పశ్చిమ బెంగాల్ లోని పురూలియా జైల్లో జరిగింది. వివరాల్లోకి వెళ్తే మనోజ్ బౌరీ (30) అనే వ్యక్తిని 2010లో పోలీసులు అరెస్ట్ చేశారు. ఓ అమ్మాయిని అతను రేపే చేయడంతో... ఆ తర్వాత ఆమె ఓ అబ్బాయికి జన్మనిచ్చింది. కుమారుడు పుట్టిన రెండు నెలలకు బాధితురాలు పోలీసులను ఆశ్రయించింది. తన కుమారుడిని స్కూల్లో చేర్పించాలంటే తండ్రి స్థానంలో ఎవరి పేరును పేర్కొనాలని ఆనాడు ఆమె ప్రశ్నించింది. దీంతో, మనోజ్ ను పోలీసులు అరెస్ట్ చేసి, కోర్టులో ప్రవేశపెట్టగా, అతనికి జైలు శిక్షను విధించింది కోర్టు. ఈ నేపథ్యంలో, బాధితురాలిని పెళ్లి చేసుకుంటానని మనోజ్ కోర్టుకు తెలిపాడు. కోర్టు కూడా అంగీకారం తెలపడంతో... ఇద్దరి పెళ్లి జైల్లో జరిగింది. సమస్య పరిష్కారం కావడంతో, త్వరలోనే మనోజ్ జైలు నుంచి బయటకు వచ్చే అవకాశం ఉంది.