: భర్త 150వ సినిమా వేడుకకు మరిది పవన్ ను ఆహ్వానించేందుకు కదిలిన చిరంజీవి భార్య సురేఖ!


చిరంజీవికి, మెగా కుటుంబానికి అత్యంత ప్రతిష్ఠాత్మకమైన 'ఖైదీ నెం. 150' చిత్రం ప్రీ రిలీజ్ ఫంక్షన్ కు పవన్ కల్యాణ్ వస్తారో... రారో అన్న సంశయం పెరుగుతున్న వేళ, మరిదిని ఈ కార్యక్రమానికి రప్పించేందుకు స్వయంగా చిరంజీవి భార్య సురేఖ రంగంలోకి దిగినట్టు తెలుస్తోంది. పవన్ కోసం సురేఖ స్వయంగా ఆయన ఇంటికి వెళ్లి హాయ్ ల్యాండ్ లో జరిగే వేడుకకు రావాలని ఆహ్వానించనున్నట్టు సమాచారం. జనవరి 7న జరిగే ఈ ప్రీ రిలీజ్ ఫంక్షన్ కు తాను తల్లిలా భావించే సురేఖ పిలిస్తే, పవన్ తప్పకుండా వస్తాడని అభిమానులు సైతం భావిస్తున్నారు. కాగా, తాను బాబాయ్ ని పిలుస్తానని, రావడం, రాకపోవడం ఆయనిష్టమని రాంచరణ్ తేల్చేసిన నేపథ్యంలో, సురేఖ పవన్ ఇంటికి వెళ్లనున్నారని వార్తలు రావడం ఆసక్తికరంగా మారింది! 

  • Loading...

More Telugu News