: హీరోయిన్ నమితకు ఇంటి యజమాని నుంచి వేధింపులు!


దక్షిణాది సినీ అభిమానులకు పరిచయం అక్కర్లేని నటి, 'జెమినీ' ఫేం, తమిళనాట అన్నా డీఎంకే అధికార ప్రతినిధి నమితకు తను నివసిస్తున్న ఇంటి యజమాని నుంచి వేధింపులు ఎదురయ్యాయి. తనను ఇల్లు ఖాళీ చేయాలని అతను ఒత్తిడి తెస్తున్నాడని ఆమె కోర్టును ఆశ్రయించారు. డిసెంబర్ 31 నాటికి ఇంటిని ఖాళీ చేయాలని వేధించాడని అసిస్టెంట్ సిటీ సివిల్ కోర్టులో వేసిన పిటిషన్ లో ఆమె ఆరోపించారు. తాను నెలకు రూ. 15 వేల చొప్పున అద్దె చెల్లిస్తున్నానని చెప్పుకొచ్చారు. కేసును విచారించిన న్యాయమూర్తి జీ శాంతి, ఇరు పక్షాల వాదనలు విని, ఈ నెల 12 వరకూ అదే ఇంట్లో ఉండేందుకు నమితకు అనుమతి ఇస్తూ, మధ్యంతర ఉత్తర్వులు జారీ చేశారు. ఈలోగా మరో ఇల్లు చూసుకుని ఖాళీ చేయాలని ఆదేశించారు.

  • Loading...

More Telugu News