: అభిమానులకు ‘థ్యాంక్స్’ చెప్పిన సమంత
తన ఫేస్ బుక్ పేజీ లైక్స్ ను డెబ్భై లక్షలకు చేర్చినందుకు దక్షిణాది నటి సమంత తన అభిమానులకు ‘థ్యాంక్స్’ చెప్పింది. ఈ మేరకు తన ఫేస్ బుక్ ఖాతాలో ఒక పోస్ట్ చేసింది. తనను అభిమాన నటిగా ఎంచుకున్నందుకు, మంచి, చెడు సమయాల్లో సమానంగా తనపై అభిమానం కురిపిస్తున్న అభిమానులకు ధన్యవాదాలని తన పోస్ట్ లో పేర్కొంది. ఈ పోస్ట్ తో పాటు ఫొటోను కూడా ఆమె జత చేసింది.