: పార్టీ అధినేత్రిగా శశికళ తొలి స్టేట్ మెంట్!
అన్నాడీఎంకే అధినేత్రిగా బాధ్యతలు చేపట్టిన శశికళా నటరాజన్ తొలిసారి స్పందించారు. సంక్రాంతి సందర్భంగా తమిళనాడులో నిర్వహించే జల్లికట్టును నిషేధించడంలో డీఎంకే, కాంగ్రెస్ హస్తం ఉందని ఆరోపించారు. ఆ రెండు పార్టీలు అధికారంలో ఉన్నప్పుడే తమిళ సంప్రదాయ క్రీడ జల్లికట్టుపై నిషేధం విధించారని అన్నారు. ఇప్పుడు ఆ రెండు పార్టీలు అవాస్తవాలు మాట్లాడుతున్నాయని ఆరోపించారు. జల్లికట్టుపై చట్టాలు తెలియకుండా స్టాలిన్ మాట్లాడుతున్నారని ఆమె మండిపడ్డారు. జల్లికట్టుపై పార్లమెంటులో చట్టం సవరించాలని అమ్మ జయలలిత మోదీకి లేఖ రాశారని ఆమె గుర్తు చేశారు.