: ఇదేం పధ్ధతి....సభను సంప్రదాయ విరుద్ధంగా నడుపుతున్నారు!: అక్బరుద్దీన్ మండిపాటు
శాసనసభను నిర్వహించే విధానంపై తెలంగాణ అసెంబ్లీలో ఎంఐఎం పార్టీ శాసనసభాపక్ష నేత అక్బరుద్దీన్ ఓవైస్ మండిపడ్డారు. శాసనసభలో ఫీజు రీయింబర్స్ మెంట్ పై చర్చ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, సభను సజావుగా నడపడంలో టీఆర్ఎస్ పార్టీ విఫలమైందని అన్నారు. సభా సంప్రదాయాలను ప్రభుత్వం పాటించడం లేదని ఆయన ఆరోపించారు. నచ్చినట్టు సభను నడిపిస్తున్నారని ఆయన విమర్శించారు. ప్రభుత్వానికి నచ్చిన వ్యక్తులు సభలో ఎంతసేపైనా మాట్లాడేందుకు అవకాశం ఇస్తున్నారని, ప్రతిపక్షాల దగ్గరకు వచ్చేసరికి మాత్రం అలా వ్యవహరించడం లేదని అన్నారు. ప్రభుత్వానికి సమాధానం చెప్పడం చేతకాకపోతే విపక్ష నేతల మైక్ కట్ చేస్తున్నారని, లేదంటే వాగ్వాదానికి తయారవుతున్నారని, మాటల మధ్యలో ఏదో ఒకరకంగా ఆపే ప్రయత్నం చేస్తున్నారని ఆయన మండిపడ్డారు.