: ఏకంగా ఒక ఊరినే అమ్మకానికి పెట్టారు!


ఎవరైనా ఓ ఇల్లు అమ్ముతారు, లేదా భూమిని అమ్ముతారు. కానీ ఏకంగా ఒక ఊరినే అమ్మకానికి పెట్టడం ఎప్పుడైనా విన్నామా? మన దగ్గరేమో కాని... కెనడాలో మాత్రం ఓ గ్రామాన్ని అమ్మకానికి పెట్టేశారు. మన కరెన్సీలో చెప్పాలంటే, రూ. 19.14 కోట్లకు దీనిని అమ్మకానికి ఉంచారు. కెనడాలోని క్యూబెక్ నగరానికి సమీపంలో ఈ గ్రామం ఉంది. దాదాపు 150 ఎకరాల విస్తీర్ణం కలిగిన ఈ గ్రామంలో 45 భవనాలు ఉన్నాయి. ఇందులో 22 నివాసాలు, ఒక చర్చ్, దుకాణాలు, మిల్లు, శ్మశానం తదితరాలు ఉన్నాయి.

ఎందుకో కానీ, గత కొన్నేళ్లుగా ఆ గ్రామం నుంచి ఒక్కొక్కరుగా ఇతర ప్రాంతాలకు తరలివెళుతున్నారు. దీంతో, గ్రామంలోని చాలా ఇళ్లు ఖాళీగానే ఉన్నాయి. ఎప్పుడూ ఆ గ్రామాన్ని మంచు దుప్పటి కప్పేసి ఉంటుంది. ఎంతో అందంగా ఉండే ఆ గ్రామానికి ప్రతి ఏటా 30 వేల మంది పర్యాటకులు కూడా వస్తుంటారు. అంతేకాదు, సినిమా, సీరియల్ షూటింగ్ లు జరుగుతుంటాయి. పలు హాలీవుడ్ సినిమాలు కూడా అక్కడ షూటింగ్ జరుపుకున్నాయి. ప్రస్తుతం ఈ గ్రామాన్ని కొనేందుకు యూరప్ లోని బడా పారిశ్రామికవేత్తలు పోటీపడుతున్నారట.  

  • Loading...

More Telugu News