jagadish reddy: ఇకపై పెళ్లి రోజే పేదింటి యువతులకు రూ.51 వేల ఆర్థిక సాయం: తెలంగాణ మంత్రి జగదీశ్‌రెడ్డి


తెలంగాణ శాస‌న‌స‌భ స‌మావేశాలు రేప‌టికి వాయిదా ప‌డ్డాయి. అంత‌కు ముందు అసెంబ్లీలో ప్రశ్నోత్తరాలు కొన‌సాగాయి. అందులో భాగంగా ప్రతిపక్ష సభ్యులు కల్యాణలక్ష్మి పథకం అమలుపై అడిగిన ప్రశ్నలకు రాష్ట్ర‌ మంత్రి జగదీశ్‌రెడ్డి సమాధానమిచ్చారు. పేద యువతుల పెళ్లిళ్ల కోసం ఆర్థిక‌ సాయం అందించ‌డమే త‌మ ల‌క్ష్య‌మ‌ని, అందుకే ముఖ్య‌మంత్రి కేసీఆర్ రాష్ట్రంలో కల్యాణలక్ష్మి, షాదీముబారక్‌ పథకాలను ప్ర‌వేశ‌పెట్టారని అన్నారు. ఈ పథకాల కింద పేదింటి యువ‌తుల‌కు రూ. 51 వేలను ఇక నుంచి పెళ్లి రోజే అందిస్తామ‌ని, అందుకు చర్యలు తీసుకుంటామ‌ని ఆయన చెప్పారు. పేద యువతుల పరిస్థితిని అర్థం చేసుకొని త‌మ స‌ర్కారు ఈ ప‌థ‌కాల‌ను కొన‌సాగిస్తోంద‌ని ఎవరో బలవంత పెడితే ఈ ప‌థ‌కాల‌ను తీసుకురాలేద‌ని అన్నారు.

jagadish reddy
  • Loading...

More Telugu News