: నోబెల్ తెండి.. రూ.100 కోట్లు కొట్టండి: సీఎం చంద్రబాబు


రాష్ట్రానికి నోబెల్ బహుమతి సాధించి తీసుకువచ్చిన వారికి రూ.100 కోట్లు నజరానాగా ఇస్తానని ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు ప్రకటించారు. తిరుపతిలో జరుగుతున్న జాతీయ సైన్స్ కాంగ్రెస్ సదస్సులో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా విద్యార్థులను ఉద్దేశించి చంద్రబాబు మాట్లాడుతూ, ‘వంద కోట్లు ప్రకటించడం కరెక్టేనా? నోబెల్ పురస్కారం సాధిస్తారా? మీరు నోబెల్ పురస్కారం సాధించాలని నేను ఆశపడుతున్నా. ప్రతిఒక్కరిలో కూడా ఆ ఆలోచనా విధానం రావాలి.

ఒలింపిక్ గేమ్స్ లో పతకాలు సాధించిన వారికి పెద్ద ఎత్తున బహమతులు ఇస్తున్నాం. ఏ విద్యార్థి నోబెల్ పురస్కారం సాధిస్తారో ఆ విద్యార్థికి వంద కోట్లు ఇస్తాము’ అంటూ విద్యార్థులను చంద్రబాబు ఉత్తేజపరిచారు. కాగా, ఈ సందర్భంగా  సైన్స్ మ్యూజియంకు శంకుస్థాపన చేశారు. అంతర్జాతీయ ప్రమాణాలతో ఈ మ్యూజియంను ఏర్పాటు చేస్తామని చంద్రబాబు చెప్పారు.

 

  • Loading...

More Telugu News