: గతంలో ఏం చేశామో... ఇప్పుడూ అదే: ఎస్పీ 'సైకిల్' గుర్తుపై ఎలక్షన్ కమిషన్
సమాజ్ వాదీ పార్టీలో ఏర్పడిన సంక్షోభం దరిమిలా, సైకిల్ గుర్తును తమకే కేటాయించాలని యూపీ సీఎం అఖిలేష్ యాదవ్ చేసిన విజ్ఞప్తిపై ఈసీ నజీమ్ జైదీ స్పందించారు. నేడు ఐదు రాష్ట్రాల ఎన్నికల షెడ్యూల్ ను విడుదల చేస్తున్న వేళ, యూపీలో సమాజ్ వాదీ ఎన్నికల గుర్తు వివాదంపై ఆయన మాట్లాడారు. సైకిల్ గుర్తు తమకు కావాలని ములాయం సింగ్ యాదవ్ వర్గం, తమకే చెందాలని అఖిలేష్ వర్గం ఈసీని సంప్రదించాయని, ఈ మేరకు వారి వినతులు, సంబంధిత పత్రాలను సమర్పించాయని తెలిపారు. వీటన్నింటినీ పరిశీలిస్తున్నామని, గతంలో ఇలాంటి వివాదాలు తలెత్తినప్పుడు ఈసీ వెల్లడించిన నిర్ణయాలను గురించి తెలుసుకుని, చట్టాలను పరిశీలించిన తరువాత తమ నిర్ణయాన్ని తెలియజేస్తామని జైదీ వెల్లడించారు.