: దేశానికి యువ శాస్త్రవేత్తలు కావాలి: చంద్రబాబు


దేశానికి యువ శాస్త్రవేత్తలు కావాలని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు అన్నారు. తిరుపతిలో బాలల సైన్స్ కాంగ్రెస్ ప్రారంభోత్సవానికి హాజరైన సందర్భంగా ఆయన మాట్లాడుతూ, సైన్స్‌ కు సాంకేతికత జోడిస్తే అద్భుత ఫలితాలు రాబట్టవచ్చని అన్నారు. గతంలో ఆడపిల్లలకు చదువు అవసరం లేదని తల్లిదండ్రులు భావించేవారని, ఈ అభిప్రాయాన్ని మార్చాలన్న లక్ష్యంతో ఎన్టీఆర్‌ తిరుపతిలో పద్మావతి మహిళా వర్శిటీని ప్రారంభించారని చెప్పారు. చిన్న చిన్న ఆలోచనలే పెద్ద ఆవిష్కరణలకు నాంది పలుకుతాయని ఆయన తెలిపారు. శాస్త్ర, సాంకేతిక రంగాల్లో యువత పాత్ర కీలకమని చెప్పిన ఆయన ప్రస్తుతం దేశానికి యువ శాస్త్రవేత్తలు అవసరమని చెప్పారు. 

  • Loading...

More Telugu News