: శేఖర్ రెడ్డి కస్టడీ పదిహేను రోజుల పొడిగింపు
తమిళనాడులో నల్లధనం కేసులో అరెస్టయిన గుత్తేదారు, తిరుమల తిరుపతి దేవస్థానం పాలకమండలి మాజీ సభ్యుడు శేఖర్ రెడ్డి, అతని సన్నిహితుడు శ్రీనివాసులు జ్యుడిషియల్ కస్టడీని సీబీఐ న్యాయస్థానం ఈ నెల 17 వరకు పొడిగించింది. నిన్నటితో వారి కస్టడీ ముగియడంతో వారిని సీబీఐ ప్రత్యేకకోర్టులో హాజరుపరిచారు. దీంతో న్యాయస్థానం మరో 15 రోజుల కస్టడీని విధించింది. కాగా, చెన్నైలోని టీనగర్ లో వెంకటనారాయణ రోడ్డులో ఉన్న శేఖర్ రెడ్డి నివాసగృహంలో స్వాధీనమైన 8 కోట్ల రూపాయల నగదుపై మరో కేసు నమోదైంది.