: సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా తొలిసారి సిక్కు వ్యక్తి... బాధ్యతలు స్వీకరించిన ఖేహర్!


సర్వోన్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ జగదీష్ సింగ్ ఖేహర్ ఈ రోజు బాధ్యతలు స్వీకరించారు. ఈ ఉదయం ఖేహర్ తో రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ ప్రమాణస్వీకారం చేయించారు. ఆగస్టు 27 వరకు అంటే దాదాపు 8 నెలల పాటు ఖేహర్ ఈ పదవిలో ఉంటారు. ప్రమాణస్వీకార కార్యక్రమానికి ప్రధాని మోదీతో పాటు పలువురు కేంద్ర మంత్రులు హాజరయ్యారు. దేశ చరిత్రలో సిక్కు వర్గానికి చెందిన ఓ వ్యక్తి సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ గా బాధ్యతలు స్వీకరించడం ఇదే తొలిసారి. జస్టిస్ ఖేహర్ సుప్రీంకోర్టులో పలు ధర్మాసనాలకు నేతృత్వం వహించారు. 

  • Loading...

More Telugu News