: 2018 నుంచి ఏపీలో ఎంసెట్ రద్దు?
2018 నుంచి ఎంసెట్‌ను రద్దు చేయాలని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం భావిస్తోంది. గతఏడాది ఎంసెట్ కౌన్సిలింగ్ లో ఏర్పడ్డ ఇబ్బందులు, 'నీట్'ను కచ్చితంగా అమలు చేయాలన్న సుప్రీంకోర్టు తీర్పు నేపథ్యంలో ఎంసెట్ రద్దుకే ప్రభుత్వం మొగ్గుచూపుతున్నట్టు తెలుస్తోంది. అయితే ఎంసెట్ రద్దు నిర్ణయం తీసుకునే ముందు భవిష్యత్ లో ఎలాంటి ఇబ్బందులు ఏర్పడకుండా, రాష్ట్ర విద్యార్థులకు నష్టం కలుగకుండా ప్రత్యేక కమిటీతో అధ్యయనం చేయించాలని ప్రభుత్వం భావిస్తోంది.