: తప్పుడు బ్యాంకు డైరెక్టర్లు, అధికారులపై ఆర్బీఐ ఉక్కుపాదం!


పెద్ద నోట్ల రద్దు తర్వాత నవంబర్ 8 నుంచి డిసెంబర్ 31 మధ్యకాలంలో... అవకతవకలకు పాల్పడిన తప్పుడు బ్యాంకు అధికారులపై రిజర్వ్ బ్యాంక్ ఉక్కు పాదం మోపుతోంది. అవకతవకలకు పాల్పడ్డ అధికారుల వివరాలను ఇవ్వాలంటూ బ్యాంకులకు ఆదేశాలు జారీ చేసింది. నోట్ల రద్దు తర్వాత తప్పుడు పనులు చేసిన ఏ ఒక్క వ్యక్తినీ ఉపేక్షించబోమంటూ ప్రధాని మోదీ ప్రకటించిన నేపథ్యంలో ఆర్బీఐ ఈ ఉత్తర్వులు జారీ చేసింది. ఈ క్రమంలో, తప్పులకు పాల్పడ్డ తమ అధికారుల వివరాలను బ్యాంకులన్నీ ఆర్బీఐకి అందించనున్నాయి.

బ్యాంకు అధికారులే కాదు బ్యాంకు డైరెక్టర్లపైనా ఆర్థికశాఖ విజిలెన్స్ ప్రొసీడింగ్స్ కొనసాగించనుంది. అత్యంత కీలకమైన డీమానిటైజేషన్ సమయంలో ప్రజలంతా ఇబ్బందులు పడుతుంటే... కొందరు బ్యాంకు అధికారులు మాత్రం కాసులకు కక్కుర్తి పడి, వ్యవస్థను నిర్వీర్యం చేసేందుకు యత్నించారని ఆర్థిక శాఖ వర్గాలు చెప్పాయి. 

  • Loading...

More Telugu News