: విశాఖపట్నంలో బీటెక్ విద్యార్థి రాసలీలలు.. షార్ట్ ఫిలిం పేరుతో ముగ్గురు యువతుల నగ్న దృశ్యాలు చిత్రీకరణ
విశాఖపట్నంలో బీటెక్ విద్యార్థి రాసలీలల బాగోతం ఒకటి బయటపడింది. షార్ట్ ఫిలిం పేరుతో ముగ్గురు యువతులకు మాయమాటలు చెప్పిన నిఖిల్ అనే బీటెక్ విద్యార్థి వారిని మోసం చేశాడు. యువతుల నగ్న దృశ్యాలు చిత్రీకరించి తన కోరిక తీర్చాలంటూ వేధింపులకు గురిచేశాడు. తను చెప్పినట్టు వినకుంటే ఆ వీడియోలను సోషల్ మీడియాలో పెడతానంటూ బెదిరించాడు. దీంతో యువతులు కంచరపాలెం పోలీసులను ఆశ్రయించడంతో నిఖిల్‌పై పోలీసులు కేసు నమోదు చేశారు.
ఫేస్‌బుక్‌లో ఓ అమ్మాయితో పరిచయం పెంచుకున్న నిఖిల్ తర్వాత ఆమెను ప్రేమిస్తున్నట్టు చెప్పి గుడిలో పెళ్లి కూడా చేసుకున్నాడు. తర్వాత ఫేస్‌బుక్‌లో మరో యువతికి గాలం వేసిన నిఖిల్ ఆమెకు సినిమాల్లో నటించాలని ఉందన్న ఆసక్తిని గుర్తించి మోసానికి ప్రణాళిక సిద్ధం చేశాడు. షార్ట్ ఫిలిం కోసం ఫొటో షూట్ చేస్తానంటూ ఇంటికి రప్పించుకుని ఆమెను లోబరుచుకున్నాడు. ఆమెకు తెలియకుండా ఫొటోలు తీసి బ్లాక్ మెయిల్ చేశాడు. ఆమెకు వచ్చిన పెళ్లి సంబంధాలను చెడగొట్టాడు. మరో అమ్మాయికి కూడా ఇదే విధమైన అనుభవం ఎదురైంది. దీంతో అతడి ఆగడాలపై సదరు యువతులు పోలీసులకు ఫిర్యాదు చేశారు.