: జేసీ దివాకర్ రెడ్డి కాదు.. జానీ వాకర్ రెడ్డి: వైసీపీ ఎమ్మెల్యే శ్రీకాంత్ రెడ్డి సెటైర్
వైఎస్సార్సీపీ అధినేత జగన్ పై టీడీపీ ఎంపీ జేసీ దివాకర్ రెడ్డి నిన్న తీవ్ర వ్యాఖ్యలు చేయడం తెలిసిందే. ఈ నేపథ్యంలో వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే శ్రీకాంత్ రెడ్డి ఘాటుగా స్పందించారు. ‘ఆయన జేసీ దివాకర్ రెడ్డి కాదు.. జానీవాకర్ రెడ్డి. తాగొచ్చి మాట్లాడితే గొప్పా? జగన్ ని జేసీ దివాకర్ రెడ్డి తిడుతుంటే చంద్రబాబు ఆనందపడుతున్నారు. జేసీతో ఆ విధంగా మాట్లాడిస్తోంది సీఎం చంద్రబాబే’ అని ఆరోపించారు. కాగా, కర్నూలు జిల్లా ముచ్చుమర్రిలో నిన్న జరిగిన బహిరంగసభలో ‘తిక్కముండా కొడుకు కాకపోతే జగన్ ఏం మాట్లాడతాడు? ఎంతసేపూ తిట్లేనా? పోలవరం మీద విమర్శలు చేస్తాడు?’ అంటూ జగన్ పై జేసీ తీవ్ర వ్యాఖ్యలు చేశారు.