: ట్రంప్ కు అమ్మలా చంద్రబాబు వ్యాఖ్యలు చేస్తున్నారు!: ఎమ్మెల్యే శ్రీకాంత్ రెడ్డి
‘పోలవరం’, ‘పట్టిసీమ’కు తమ పార్టీ వ్యతిరేకమనడం అవాస్తవమని, ఆ విధంగా మాట్లాడేవారి నాలుక కోస్తామని, ట్రంప్ కు అమ్మలా చంద్రబాబు వ్యాఖ్యలు చేస్తున్నారని వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే శ్రీకాంత్ రెడ్డి ఘాటు వ్యాఖ్యలు చేశారు. ఈరోజు ఆయన మీడియాతో మాట్లాడుతూ, పోలవరం ప్రాజెక్టుకి జాతీయహోదా కోసం దివంగత నేత వైఎస్ రాజశేఖర రెడ్డి కృషి చేస్తే, నాడు చంద్రబాబునాయుడు అడ్డుపడ్డారని విమర్శించారు. శ్రీశైలం నుంచి రాయలసీమకు నీళ్లిస్తామని జీవో విడుదల చేయాలని, పురుషోత్తమపట్నం ప్రాజెక్టులో అవకతవకలు చోటుచేసుకున్నాయని ఆయన ఆరోపించారు.